5, ఏప్రిల్ 2015, ఆదివారం

ఢిల్లీలో హై అలర్ట్...

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం నుంచి రహస్య సమాచారం అందింది. ఢిల్లీలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ బాంబు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని సూచించింది. 
 
జనాభ అధికంగా సంచరించే రైల్వే స్టేషన్‌లు, బస్టాండు ప్రాంతాల్లో బాంబులు పేల్చే ప్రమాదం ఉన్నట్టు తెలిపింది. కనుక అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రాన్ని హెచ్చరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలో హై అలెర్ట్‌ను ప్రకటించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి