5, ఏప్రిల్ 2015, ఆదివారం

కేంద్ర పన్నుల వాటలు విడుదల.. ఆంధ్రాకు రూ. 1616 కోట్లు, తెలంగాణకి రూ. 915 కోట్లు..!

2015 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్రం భాగస్వామి అవుతుందని పేర్కొన్న విధంగా మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన తొలి విడత పన్నులవాటాను పంపిణీ చేసింది.
 
దేశంలోని అన్ని రాష్ట్రాలకు 37,420 కోట్ల రూపాయలు విడుదల చేయగా, ఆ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాలకు 2,531 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో 1616 కోట్లను ఆంధ్రప్రదేశ్ పన్నుల వాటాగానూ, 915 కోట్ల రూపాయలను తెలంగాణ పన్నుల వాటాగా కేంద్రం నిర్ణయించింది. కాగా, ఏప్రిల్ ఒకటో తేది నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి