5, ఏప్రిల్ 2015, ఆదివారం

బాహుబలి ఆడియో రిలీజ్‌

రాజమౌళి టైమ్ వర్కౌటైంది. బాహుబలి ఆడియో రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాహుబలి టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇక పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆడియో లాంఛ్‌ను అట్టహాసంగా నిర్వహించాలని రాజమౌళి ప్లాన్ చేశారు.
 
ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆడియో లాంఛ్ కూడా ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో నిర్వహించాలని యూనిట్ ప్లాన్ చేసేసింది. తద్వారా బాహుబలి ఆడియో ఫంక్షన్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీల మధ్య అట్టహాసంగా జరుగుతుందని ప్రేక్షకులు యమా హ్యాపీగా ఉన్నారు. కొరియా కొన్ని పనులు ముగించుకున్నాక రాజమౌళి ఆడియో ఫంక్షన్‌ తేదీని ఖరారు చేస్తారని సమాచారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి